Belly Fat Burning Ayurveda : ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్యాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. మారుతున్న జీవన విధానం, గజిబిజి ఆహారపు అలవాట్లకు తోడు శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో చిన్న పెద్దా తేడా లేకుండా బరువు పెరుగుతున్నారు. పెద్దలకేమో ఆఫీసు బిజీ, చిన్నారులకు ఆరుబయట ఆటలు లేక ఉబకాయం వస్తుంది. మరోవైపు యువత సైతం బయట హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బాగా తింటున్నారు. అందులో వాడే నూనెల వల్ల కొవ్వు పెరిగిపోయి పొట్ట వస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. దీనికోసం జిమ్ కెళ్లడం, ఆన్లైన్లో ప్రత్యేకంగా కోచ్‌ను పెట్టుకునే వారు కొందరైతే... యూట్యూబ్‌లో కొందరి వీడియోలు ఉచితంగా చూసి ప్రయత్నాలు చేసే వాళ్లు ఇంకొందరు. ఏదేమైనా వారి లక్ష్యం ఆ పొట్టను తగ్గించడమే. ముఖ్యంగా ఉదరం కింది భాగంలో ఉండే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించాలంటే కత్తి మీద సాముతో కూడుకున్న పనే. శారీరకంగా చాలా శ్రమ పడి చెమటోడ్చాల్సి వస్తుంది. ఇవే కాకుండా.. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు పలు ఆయుర్వేద మూలికలు ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి 6 మూలకాలు, అవి ఎలా పనిచేస్తామో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. అల్లం
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది అల్లం గురించి. దాదాపుగా అందరి ఇంట్లో ఇది ఉంటుంది. రోజూ వంటల్లో, ఇతర పదార్థాల్లోనూ వాడతారు. అయితే.. అల్లాన్ని సాధారణంగా ఆయుర్వేదంలో వివిధ జీర్ణ సమస్యలకు ఉపయోగిస్తారు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరిచి, జీవక్రియను పెంచుతుందని.. అంతేకాకుండా కొవ్వును కరిగించడంలోనూ తగిన పాత్ర పోషిస్తుందని నమ్ముతారు.
2. దాల్చిన చెక్క
ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు చేసే వంటకాల్లో తప్పని సరిగా దాల్చిన చెక్క ఉండాల్సిందే. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మన ఎనర్జీ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచడం ద్వారా ఆకలిని తగ్గిస్తుంది. పరోక్షంగా బరువు తగ్గడంలో సాయపడుతుంది.
3. గుగ్గుల్
గుగ్గుల్‌ను సాధారణంగా ఆయుర్వేదంలో వెయిట్ మేనేజ్మెంట్లో ఉపయోగిస్తారు. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా.. ఫ్యాట్ మెటబాలిజాన్ని ప్రమోట్ చేస్తుందని విశ్వసిస్తారు. ఇందులోని పలు లక్షణాల్ని బట్టి దీన్ని.. పలు యాంటీ ఇన్ ఫ్లమేటరీ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.