తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బీట్‌రూట్‌ ఇలా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు దూరం! - Skin Benefits Beetroot in telugu

Beetroot For Skin Benefits : బీట్‌రూట్‌ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని మనందరికీ తెలిసింది. ఇందులో ఉండే యంటీఆక్సిండెంట్లు, పోషకాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అయితే.. ఈ బీట్‌రూట్‌ను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Beetroot For Skin Benefits
Beetroot For Skin Benefits

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 11:43 AM IST

Beetroot For Skin Benefits : రోజూవారి ఆహారంలో బీట్‌రూట్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నరు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ బి6, ఐరన్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు.. అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయట. అయితే.. ఇన్ని పోషకాలు ఉన్న బీట్‌రూట్‌ మన ఆరోగ్యాన్నే కాదు.. చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగు పరుస్తుందని చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. చర్మ సమస్యలు రాకుండా నివారిస్తాయని అంటున్నారు. మరి.. బీట్‌రూట్‌తో మీ అందాన్ని ఎలా పెంచుకోవాలో ఈ కథనంలో చూడండి.

మొటిమలకు చెక్‌..
రెండు స్పూన్ల పెరుగులో.. రెండు స్పూన్ల బీట్‌రూట్‌ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఇలా ప్యాక్ వేసుకుంటే పింపుల్స్‌, వాటి మచ్చలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు.

చర్మం క్లీన్‌..
రోజూ ముఖానికి బీట్‌రూట్‌ రసం రాసి పది నిమిషాలపాటు మర్దన చేస్తే.. ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి కాంతివంతగా తయారవుతుంది. అలాగే టేబుల్‌ స్పూన్‌ బియ్యప్పిండిలో.. చెంచా ఆపిల్‌ గుజ్జు, రెండు చెంచాల బీట్‌రూట్‌ రసం, చెంచా నువ్వుల నూనె వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. దీన్ని స్నానం చేసేటప్పుడు శరీరానికి రాసుకుంటే మృతకణాలు తొలగి చర్మం నిగనిగలాడుతుంది.

ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తే - పార్లర్​కు వెళ్లకుండానే మెరిసే అందం మీ సొంతం!

నల్లని మచ్చలు దూరం..
కొంతమందికి వివిధ కారణాల వల్ల ముఖంపై నల్లని మచ్చలు వస్తుంటాయి. ఈ సమస్యతో బాధపడేవారు బీట్‌రూట్ జ్యూస్, టమాటా రసం కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని మచ్చలపై రాసుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మచ్చలు చర్మం రంగులో కలిసిపోతాయని నిపుణులు అంటున్నారు.

డార్క్‌ సర్కిల్స్‌కు చెక్‌..
ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలతో చాలామంది కళ్ల చుట్టూ డార్క్‌ సర్కిల్స్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు.. బీట్‌రూట్ జ్యూస్‌లో దూదిని ముంచి దానితో కనురెప్పలతో పాటు కళ్ల చుట్టూ అద్దుకొవాలి. కొంత సమయం తరవాత ముఖాన్ని కడిగేయాలి. ఇలా కంటిన్యూగా చేస్తే.. డార్క్‌ సర్కిల్స్‌ దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

గులాబీ పెదాలకి..
చాలా మంది పెదాలు లేత గులాబీ రంగులో ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారు వారానికి రెండుసార్లు బీట్‌రూట్‌ రసంలో కొద్దిగా చక్కెర కలిపి, ఆ మిశ్రమాన్ని పెదవులపై మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

జెల్‌ కోసం..
చెక్కు తీసిన అరకప్పు బీట్‌రూట్‌ ముక్కల్లో అరగ్లాసు నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించాలి. ఇందులో అరచెంచా సోంపు వేసి చల్లారనివ్వాలి. తరవాత ఆ నీటిని వడకట్టి, రెండు చెంచాల అలోవెరాజెల్‌, చెంచా రోజ్‌వాటర్‌ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ జెల్‌ని ముఖానికి పట్టిస్తే మొటిమలు, మచ్చలు తొలగి ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.

ల్యాప్​టాప్​ ఒడిలో పెట్టుకుని వర్క్​ చేస్తున్నారా? బీ కేర్​ ఫుల్​- ఈ సమస్యలకు వెల్​కమ్​ చెప్పినట్లే!

ఆఫ్ట్రాల్ పల్లీ పట్టి అని తీసిపారేయకండి - ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలిస్తే వదిలిపెట్టరు!

ABOUT THE AUTHOR

...view details