Beerakaya Health Benefits In Telugu: బీరకాయ అనేది ఒక సాధారణమైన కూరగాయ రకం. ఇందులో ఫైబర్, విటమిన్-సి, ఐరన్ సహా వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాస్తవానికి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కనుక ఇవి కడుపులోని మంటను, శరీర బరువును చాలా చక్కగా నియంత్రిస్తాయి.
బీరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు
- బరువు తగ్గుతారు :
Ridge Gourd For Weight Loss : బరువు తగ్గడానికి బీరకాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు, సంతృప్త కొవ్వులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. మరోవైపు పీచు పదార్థాలు, నీళ్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బీరకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల.. త్వరగా ఆకలివేయదు. ఫలితంగా క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. - రోగనిరోధక శక్తి పెరుగుతుంది :
Ridge Gourd Immune System Improvement: బీరకాయలో విటమిన్-సి, ఐరన్, మెగ్నీషియం, జింక్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక బీరకాయను ఆహారంగా తీసుకుంటే.. కళ్లు, కాలేయం, కడుపు మంట, మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ల లాంటి ప్రమాదాలు తగ్గుతాయి. - గుండె పదిలంగా ఉంటుంది :
బీరకాయ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా అంటే.. బీరకాయ మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పైగా దీని మెగ్నీషియం, పొటాషియం అనే మూలకాలు హృదయనాళ వ్యవస్థను మరింత ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తాయి. బీరకాయలోని చాలా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీర కణాలకు హాని కలింగే సూక్ష్మజీవులు, వైరస్‌లతో పోరాడి.. మనల్ని రక్షిస్తాయి. - మలబద్ధకాన్ని తగ్గిస్తుంది :
బీరకాయలో డైటరీ ఫైబర్, వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కనుక మలబద్ధకం నివారణ అవుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా నియంత్రించబడతాయి. - మధుమేహాన్ని నియంత్రిస్తుంది :
Turai For Diabetes Control : మధుమేహం ఉన్నవారు బీరకాయ తీసుకుంటే చాలా మంచిది. వాస్తవానికి బీరకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కనుక రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పైగా ఇది బీరకాయలోని పోషక పదార్థాలు మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని, జీవక్రియలు ప్రేరేపిస్తాయి. ఫలితంగా మధుమేహం అనేది చాలా వరకు నియంత్రణలో ఉంటుంది.