Bedwetting Solutions in Teenage Children :సాధారణంగా.. పసిపిల్లలు పక్కతడుపుతుంటారు. ఈ సమస్య.. పిల్లలకు మూడు లేదా నాలుగు సంవత్సరాలు వచ్చేవరకు ఉంటుంది. అయితే కొంత మంది పిల్లల్లో ఐదారేళ్లు దాటే వరకూ ఉంటుంది. కానీ.. టీనేజ్ వచ్చే వరకూ కొందరిలో ఈ సమస్య తగ్గదు. పెద్దైన తర్వాత కూడా పిల్లలు పక్కతడుపుతుంటే.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఆరాటంలో.. చాలా మంది తల్లిదండ్రులు కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే.. అలా చేయడం ద్వారా సమస్య పెరుగుతుందేకానీ.. తగ్గదని అంటున్నారు నిపుణులు. మరి, దీనికోసం ఏం చేయాలి? అసలు నిద్రలో పిల్లలు పక్కతడపడానికి కారణాలు ఏంటి..? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీ ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా లేకపోతే - ముఖ్యంగా పెళ్లైన వాళ్లకు - ఈ సమస్యలు గ్యారెంటీ!
కారణాలేంటి..?
- మానసిక ఒత్తిడి చిన్న పిల్లల్లో తరచుగా మూత్రవిసర్జనకు కారణం అవుతుంది.
- తల్లిదండ్రుల భయం, కుటుంబ సభ్యుల మరణం, ప్రమాదాలు, కొత్తగా స్కూల్‌కు వెళ్లడం కూడా ఈ సమస్యకు కారణమవుతాయి.
- మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం.. లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
- ఈ సమస్యతో ఉన్న పిల్లలు.. ఎక్కువ సమయం మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకుంటారు.
- ఆహారంలో అధికంగా కెఫిన్ లేదా డైయూరిటిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా.. మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది.
- బిడ్డ వయసు 6, 7 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పక్కతడిపితే ఆలోచించాల్సిందే
- ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
6 యోగాసనాలతో పని ఒత్తిడి మాయం! ఆఫీస్‌లోనే కుర్చీలో ఈజీగా వేసేయండిలా!