తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Beauty Tips: చారడేసి కళ్ల కోసం.. మాయ చేసే మేకప్! - కళ్లు అందంగా కనిపించడానికి చిట్కాలు

Beauty Tips: పెద్ద పెద్ద కళ్లు ముఖానికి ఓ ప్రత్యేక అందాన్నిస్తాయి. ముఖానికి తగ్గట్టుగా కళ్ల పరిమాణం ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందిరిలో కళ్లు చాలా చిన్నాగా ఉంటాయి. మరి వారి కళ్లను పెద్దగా కనిపించేలా మేకప్​లో చిన్న చిట్కాలు పాటించాలి. అవి ఏంటంటే..?

eyes beauty tips
కళ్లు

By

Published : Feb 7, 2022, 8:01 AM IST

Beauty Tips: తీరైన కనుబొమ్మలు, పెద్ద పెద్ద కళ్లు.. ముఖానికి ప్రత్యేక అందాన్ని తెస్తాయి. కానీ కొందరికి కళ్లు మరీ చిన్నగా ఉంటాయి. మరి వాళ్లకెలా? మేకప్‌తో కొంత మాయ చేస్తే సరి. ఎలాగంటే..

  • ఐ మేకప్‌ అనగానే.. మనకు కాటుకే గుర్తొస్తుంది. ఇది అందాన్ని తెస్తుందన్న మాట నిజమే కానీ.. కళ్లు పెద్దగా కనిపించాలంటే దీన్ని పక్కన పెట్టేయ్యాల్సిందే. బదులుగా తెలుపు, శరీర రంగులో కలిసిపోయే రకాల్ని ఎంచుకోండి. కనుమూలల్లో సన్నగా రాస్తే చాలు.
  • కనుబొమ్మలూ ఈ విషయంలో మాయ చేస్తాయి. మరీ మందంగా ఉంటేనే అందమనుకోకండి. మరీ సన్నగా ఉండకుండా ఉంటే చాలు. కాస్త విల్లులా ఒంపు తిరిగినట్లుగా చేసుకుంటే చాలు. కళ్ల పరిమాణం పెద్దగా కనిపించేలా చేస్తాయి.
  • కనురెప్పలపై ముదురువి కాకుండా లేత రంగులకు ప్రాధాన్యమివ్వాలి. ఇవీ అనుకున్న మాయ చేసేస్తాయి. వేసుకున్న వస్త్రాల దృష్ట్యా ముదురు రంగులు తప్పనిసరి అయితే కనుమూలల్లో లేత రంగు ఐషాడోతో హైలైట్‌ చేస్తే సరి.
  • కనురెప్పలకు మస్కారా వేయడం మరిచిపోవద్దు. ఆ వెంట్రుకలు నిటారుగా ఉన్నా కళ్లు చిన్నవన్న భావన తెస్తాయి. కాబట్టి. కాస్త ఒంపు తిప్పేయండి. అందమూ.. అనుకున్న లుక్కూ దక్కుతాయి.

ABOUT THE AUTHOR

...view details