Bananas for Hair Growth :జుట్టు ఒత్తుగా.. నిండుగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందులోనూ.. మహిళల గురించి చెప్పాల్సిన పనిలేదు. వారికి జుట్టే ఆకర్షణీయం కాబట్టి.. దాని సంరక్షణ కోసం ఎన్నో తిప్పలు పడుతుంటారు. ప్రస్తుతం వింటర్ సీజన్ కాబట్టి.. ఈ సమయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. హెయిర్ ఫాల్(Hair Fall)సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సీజన్లో మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్టయితే.. ఈ హెయిర్ ప్యాక్ఓ సారి ట్రై చేయండి. ఈ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం పెద్దగా డబ్బు ఖర్చుచేయాల్సిన పని కూడా లేదు. మార్కెట్లో తక్కువ ధరకే దొరికే అరటిపండ్లతో వాటికి చెక్ పెట్టొచ్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదివేయండి.
How to Use Bananas for Hair Growth :అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. ఈ పండు జుట్టును మెరిపించి, మృదువుగా మారుస్తుందనే సంగతి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం పొల్యూషన్ వల్ల ఎక్కువ మంది జుట్టు నిర్జీవంగా మారి ఊడిపోతోంది. జుట్టు రంగు, మెరుపు తగ్గిపోతాయి. అంతేకాదు.. మనం తినే ఆహారం వల్ల కూడా కురులు పటుత్వాన్ని కోల్పోాతాయి. ఇలాంటి సమస్యలన్నీ దూరమై.. మీ జుట్టు బలంగా నిగనిగలాడాలంటే అరటిపండు(Banana)తో చేసే హెయిర్ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ దానిని ఎలా తయారుచేసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.