అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్‌డీఎల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మంచి కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమని.. చెడు కొలెస్ట్రాల్ వల్ల శరీరానికి ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా?.. రోజూ వీటిని తినండి! - cholesterol reducing foods
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
మంచి కొలెస్ట్రాల్ మానవ శరీరంలోని డి విటమిన్, హార్మోన్లు, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే పదార్థాలను తయారు చేస్తుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ మాత్రం గుండెపోటు, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు. మనం తీసుకొనే ఆహారాన్ని బట్టే మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఏర్పడతాయని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి జీవన శైలి అలవరచుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఆహార పదార్థాలు:
- డార్క్ చాక్లెట్లను తినడం వల్ల కొంత వరకు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
- అవకాడోలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడంలో ఉపయోగపడతాయి. వీటి నుండి వచ్చే నూనెను సైతం వంటల్లో వాడుకోవచ్చు. నట్స్, అవిసె గింజలు, చేపలు వంటివి తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
- గ్రీన్‌టీ, బ్లాక్ టీలు సైతం శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
- కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు తృణదాన్యాలు, ఆలివ్ నూనె బాగా ఉపయోగపడతాయి.
- తాజా కూరగాయలు, పండ్లు, ఓట్స్, బార్లీ గింజలు, సోయాబీన్స్, పప్పు దాన్యాలు, చిక్కుళ్లు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
- పండ్లలో ముఖ్యంగా యాపిల్, నారింజ, నిమ్మ శరీరానికి అవసరం.
- బాదం, వెన్న, పసుపును వంటల్లో వాడుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఇవీ చదవండి:
- సన్ స్క్రీన్ లోషన్ వాడితే రాషెస్ వస్తున్నాయా? ఇలా చేయండి!
- మీ చూపు మసకబారుతోందా?... సమస్య అదే కావొచ్చు.. జాగ్రత్త!