Ayurveda For Caugh: చల్లటి గాలి వీచినా.. నాలుగు వాన చినుకులు కురిసినా.. దగ్గు, జలుబు వెంటనే పట్టుకుంటాయి కొందరిని! ఇమ్యూనిటీ మరింత వీక్ గా ఉన్నవారికైతే.. ఆకాశంలో మబ్బులు పట్టినా సరే.. గొంతు పట్టేస్తుంది. ఇలాంటి వారు వెదర్ కండీషన్ నార్మల్ అయ్యేంత వరకూ ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఈ సమస్యకు వెంటనే ఉపశమనం లభించేందుకు ఆయుర్వేదంలో చక్కటి మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇందు కోసం ఓ ఔషధాన్ని సూచిస్తున్నారు. మరి, దాన్ని ఎలా తయారు చేయాలి? ఇందుకోసం ఎలాంటి వస్తువులు కావాలి? అన్నది చూద్దాం.
Natural Medicine For Cold : ఈ నేచురల్ మెడిసిన్ తయారు చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సింది లేదు.. కష్టపడాల్సింది కూడా లేదు. కేవలం మూడంటే మూడే వస్తువులు సరిపోతాయి. అందులో ఒకటి అల్లం పొడి. అంటే.. పచ్చిది కాదు. పొడిగా ఉండాలి. రెండోది బెల్లం. మూడోది దేశీయ ఆవునెయ్యి. ఈ మూడు పదార్థాలను సరి సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ పదార్థాలను ఒక గిన్నెలో వేసి చక్కగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత వాటిన్ని చిన్న చిన్న లడ్డూ మాదిరిగా తయారు చేయాలి. అంతే.. నేచురల్ మెడిసిన్ సిద్ధమైపోయినట్టే.
Weight loss tips in telugu : బరువు తగ్గాలా..? కుస్తీలు అవసరం లేదు.. రోజూ ఇలా చేస్తే చాలు!
Ayurveda For Infections : ఇప్పుడు ఈ ఆయుర్వేద గోలీలను దగ్గు, జలుపు ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి ఇవ్వాలి. చిన్నారులతోపాటు పెద్దలు కూడా తీసుకోవచ్చు. వీటిని నోట్లో వేసుకొని చప్పరిస్తే సరిపోతుంది. అలర్జీలతో ఇబ్బంది పడే పిల్లలకు ఇది ఎంతో మంచి ఔషధమని చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ నివారించడంతోపాటు దగ్గు, జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
Ayurveda For Stomach Problems : అంతేకాదు.. పొట్ట సమస్యలకు కూడా ఈ మందు చక్కగా పనిచేస్తుందని అంటున్నారు. కడుపులో మంట వేధించే వారికి ఉపశమనం లభిస్తుందట. జీర్ణక్రియలో ఏవైనా ఇబ్బందులు ఉంటే.. వాటిని కూడా తొలగిస్తుందని చెబుతున్నారు. దీంతోపాటు ఇమ్యూనిటీ తక్కువగా ఉండి, బలహీనంగా కనిపించే వారికి కూడా ఇది ఉత్తమంగా పని చేస్తుందంటున్నారు నిపుణులు.