hair and skin care tips: ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే జుట్టు, చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారా? ఇంట్లో సులభంగా తయారుచేసుకునే కొన్ని పదార్ధాలను ఉపయోగించుకుని లబ్దిపొందాలి అనుకుంటే ఈ కింద పద్దతులను పాటించండి.
చర్మానికి సంబంధించిన చిట్కాలు..
- చర్మం మెరుపు కోసం..వెన్నకు గుడ్ల సొన కలిపి క్రీమ్‌లా తయారు చేయండి. ఈ మిశ్రమంతో మీ ముఖానికి మర్దన చేయాలి. దీని వల్ల మీ ముఖంలో గ్లో వస్తుంది.
- మొటిమలు..జాజికాయ పొడి, చందనం, మిరియాల పొడి సమపాళ్లలో కలిపాలి. అవసరమైతే మిరియాల పొడిని మితంగా వేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి పాలు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇది మీ మొటిమల సమస్యను తొలగిస్తుంది.
- చర్మ సమస్యలు.. ఉసిరికాయ పొడి, వేపాకు పొడికి నెయ్యి కలిపి తాగితే అలర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉసిరికాయ పొడిని బెల్లంతో కలిపి కూడా వాడవచ్చు. అల్లం రసం, బెల్లం మిశ్రమం కూడా ఫలితాన్ని ఇస్తుంది.
- చర్మ వ్యాధులు..వేప పొడి, హరాడ్ పొడి, ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని నెలపాటు తీసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గేందుకు సహాయపడుతుంది. వేప ఆకులు లేదా ఉసిరికాయ పడిగడుపున తినటం మంచిది.
- ఆయిలీ స్కిన్ కోసం.. కొబ్బరి పాలతో ముఖానికి మర్దన చేయాలి. ఇది మీ ముఖంపై జిడ్డును పోగొడుతుంది.