Ayurvedic Remedies to Reduce Cholesterol :కొవ్వు అధికంగా ఉండే ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామాలు చేయకపోవటం లాంటి వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. పోషకాహారానికి బదులు ఆరోగ్యానికి నష్టం చేసే జంక్ పుడ్స్‌ను తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం లాంటివి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
Cholesterol Reducing Foods :చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి ఆహారపు అలవాట్లల్లో మార్పులు, వ్యాయామాలు చేయటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెడతారు. కొలెస్ట్రాల్ తగ్గించకునేందుకు మన సంప్రదాయ ఆయుర్వేదంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించటానికి ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు ఏంటో చూద్దాం.
తేనె
Honey For Cholesterol Reduction :రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా తేనె పనిచేస్తుంది. ప్రతి రోజూ కప్పు వేడి నీటిలో టీస్పూన్ తేనె, నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తీసుకుంటే మంచిది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్తపడొచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్.. అధిక కొలెస్ట్రాల్ తగ్గించటంలో సహాయం చేస్తుంది. ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసుకొని, దానిని 50 మి.లీ పాలు, 200మీ.లీ నీటిలో వేసి మరిగించి తీసుకోవాలి.
పసుపు
Turmeric Benefits For Cholesterol :పసుపు రక్తనాళాల్లో కొవ్వును చేరకుండా ఉండేలా చేస్తుంది. పసుపును తరచుగా కూరల్లో వాడతాం. వంకాయ గుజ్జు, పసుపును సమపాళ్లలో తీసుకోవాలి. వాటిని నీటితో కలిపి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్రైడ్ స్లైడ్స్ మధ్య పెట్టి భోజనం తరవాత ఆరగించాలి.
మెంతులు
మెంతుల్లో పొటాషియం, ఐరన్, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఒక చెంచా మెంతి పొడిని గోరువెచ్చని నీటితో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు.