Skin Care Common Mistakes : ప్రతి ఒక్కరూ చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ.. ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ చర్మ సౌందర్యం కోసం ఏవేవో టిప్స్ పాటిస్తూ ఉంటారు. అయినా కొన్నిసార్లు చర్మం జిడ్డుగా, కాంతిహీనంగా తయారవుతుంది. ఇందుకు కారణం.. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణం మార్పులు. అయితే చర్మం డ్యామేజ్ కావడానికి.. ఇవి మాత్రమే కారణం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మాన్ని(Skin) జాగ్రత్తగా ఉంచుకోవాలనే క్రమంలో డైలీ తెలిసో తెలియకో మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణమని చెబుతున్నారు. అందుకే ఆ తప్పులు చేయకుండా ఉన్నారంటే మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరుస్తుందంటున్నారు. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సరిగ్గా ఫేస్ వాష్ చేసుకోకపోవడం : చాలా మంది ఫేస్‌కి వేసుకున్న మేకప్‌ను తొలగించుకోవడంలో అశ్రద్ధ వహిస్తారు. ఇక కొందరు పైపైన ఫేస్‌వాష్ చేసుకుంటారు. మేకప్‌ను తొలగించుకోవడానికి సరైన క్లెన్సర్‌ని యూజ్ చేయరు. కాబట్టి.. మీరు ఎప్పుడైతే.. సరైన క్లెన్సర్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటారో.. అప్పుడే మీ చర్మ రంధ్రాలు మూసుకుపోవు. అప్పుడు చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.
ఓవర్ ఎక్స్‌ఫోలియేటింగ్ : చర్మం దెబ్బతినడానికి మీరు చేసే మరో తప్పు ఓవర్ ఎక్స్‌ఫోలియేటింగ్. సాధారణంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా చనిపోయిన చర్మకణాలను తొలగించుకోవచ్చు. కానీ, ఎక్కువగా ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల మీ చర్మం సహజ నూనెలు పోయి చర్మానికి మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీ చర్మ రకానికి అనుగుణంగా వారానికి రెండు నుంచి మూడుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయండి.
మేకప్‌తో నిద్రపోవడం : చాలా మంది చేసే మరో పొరపాటు.. పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యే ఓపిక లేక మేకప్‌తోనే నిద్రపోతారు. కానీ అది చర్మానికి నష్టం కలిగించే అతి పెద్ద పొరపాటు. మేకప్‌తో పడుకోవడం ద్వారా మీ చర్మ రంధ్రాలు, నూనె గ్రంథులు మూసుకుపోతాయి. దాంతో చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ అలవాటును మార్చుకోవాలి.
సరైన క్రమంలో ప్రొడక్ట్స్ అప్లై చేయకపోవడం :ఈ రోజుల్లో మెజార్టీ జనాలు ఫేస్ క్రీమ్స్ వాడుతున్నారు. అయితే చాలా మంది ఏదో ఆదరా బాదరాగా అలా ఆ ప్రొడక్ట్స్ చర్మానికి పూసేస్తుంటారు. ఇది కూడా చర్మానికి హాని కలిగిస్తుంది.
మురికిగా మారిన మేకప్ బ్రష్‌లు వాడడం : కొంతమంది చాలా రోజులుగా ఒకే మేకప్ బ్రష్ వాడుతుంటారు. దాంతో అది మొత్తం మురికిగా మారుతుంది. అయితే డర్టీ మేకప్ బ్రష్‌లు కూడా మీ చర్మానికి మీరు అనుకున్నదానికంటే ఎక్కువ హాని చేస్తున్నాయి. కాబట్టి మీ బ్రష్‌లను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.
అరటి తొక్కే అని తేలిగ్గా పారేయకండి- ఇలా వాడితే మెరిసే చర్మం మీ సొంతం!
సన్‌స్క్రీన్ ధరించకపోవడం : చర్మం వృద్ధాప్యం నుంచి రక్షణ పొందాలంటే.. బెస్ట్ ఆప్షన్ సన్‌స్క్రీన్. ఇది శీతాకాలంలో కూడా ప్రతిరోజూ ఉపయోగించాలి. దీనికి 30 లేదా అంతకంటే ఎక్కువ SPF ఉందని నిర్ధారించుకోవాలి. ప్రతిరోజూ మీ ఛాతీకి, మీ చేతుల పైభాగానికి అప్లై చేయడం మర్చిపోవద్దు.