Avoid These Foods to Better Sleep in Night: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన తిండితో పాటు ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్ర అవసరం. కానీ ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఇలా పలు రకాల కారణాల వల్ల చాలా మంది నిద్రకు దూరమైపోతున్నారు. నిద్రలేమి సమస్య ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అయితే రాత్రుళ్లు హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. దీనితో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం, బీపి అదుపులో ఉండటం, చర్మానికి మెరుపు... ఇలా చాలా రకాలుగా మేలు జరుగుతుంది. కాగా, నిద్రకు ముందు మనం తీసుకునే ఆహారాలు లేదా పానీయాలు మన నిద్రను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి నిద్రకు ముందు మనం తీసుకోకూడని ఆహారాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా? - అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే!
స్పైసీ ఫుడ్స్:చాలా మంది రాత్రి సమయాల్లో స్పైసీ ఫుడ్‌ను కచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే మనం రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే ముందుగా స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. స్పైసీ ఫుడ్స్, మసాలాలు తినడం వల్ల పొట్టలో సమస్యలు వస్తాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌ను కూడా కలిగిస్తుంది. అలాగే నిద్రకు భంగం కలిగిస్తుంది. మీకు ఇప్పటికే గుండెల్లో మంట ఉంటే స్పైసీ ఫుడ్స్‌కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
కూరగాయలు:కూరగాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. రాత్రిపూట కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి రాత్రిపూట వీటిని తింటే నిద్రకు భంగం కలుగుతుంది.
ఉసిరితో జీర్ణసమస్యలు దూరం! ఇంకెన్నో లాభాలు- రోజుకు ఒకటి తింటే చాలు!
ప్రాసెస్డ్ ఫుడ్స్:ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, బర్గర్స్ వంటివి రాత్రి పడుకునే ముందు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆహారాలు అజీర్తిని కలిగిస్తాయి. రాత్రిపూట ఇటువంటి ఆహారాలు విరేచనాలకు కూడా కారణమవుతాయి.
తియ్యటి ఆహారాలు:ఐస్‌క్రీం, జ్యూస్‌లు, స్వీట్లు, తీపిని అధికంగా కలిగి ఉండే ఇతర ఆహారాలు తినడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటారు. తద్వారా మీరు నిద్రకు దూరమవుతారు. కాబట్టి నైట్ టైమ్‌లో స్వీట్స్‌కు దూరంగా ఉండాలి.