సెక్స్ అంటే కేవలం శారీరక ఆనందం కోసం మాత్రమే కాదు. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం శారీరకంగా ఆరోగ్యకరమైనది. సెక్స్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయట. మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెక్స్‌లో పాల్గొనడం వల్ల బ్రెయిన్‌కు ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ చేయడం వల్ల అనేక వ్యాధులు మీ దగ్గరికి కూడా రావు. అవేంటో తెలుసుకుందాం.
సెక్స్ చేయడం వల్ల ఒంట్లో కొవ్వు తగ్గుతుందని.. ఇమ్యూనిటీ పెరగడానికి కూడా దోహదం చేస్తుందని పలు అధ్యయనాలు గతంలో పేర్కొన్నాయి. శృంగారం చేయడం వల్ల గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుందని తేలింది. పలు వైరస్ల బారి నుంచి ఎదుర్కొవడానికి సెక్స్ సహకరిస్తుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి ఆ కార్యం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. వారంలో ఒకసారి లేదా రెండు సెక్స్ చేసుకునే వారిలో రోగ నిరోధక శక్తి పెరిగిందని రీసెర్చ్ ద్వారా తేలింది.