తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఆస్తమా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఆస్తమా ముందు జాగ్రత్తలు

Asthma Precautions: సీజన్​ మారిన ప్రతిసారి ఆస్తమా సమస్యలు పెరిగిపోతుంటాయి. ఉబ్బసం వ్యాధి ఉన్నవారి బాధలు అన్నీ ఇన్నీ కావు. మరి దీనిని ఎదుర్కోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..

Asthma Precautions
ఆస్తమా

By

Published : Mar 10, 2022, 8:01 AM IST

Asthma Precautions: డెంగీ, మలేరియా లాగానే ఆస్తమా సమస్య మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒక్క చలికాలంలోనే కాకుండా సీజన్ మారినప్పుడల్లా ఆస్తమా ఇబ్బంది పెడుతుంది. గాలిని ఊపిరితిత్తులకు మోసుకెళ్లే నాళాలు వాచి ఉబ్బడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. గాలి పీల్చినప్పుడు పూర్తి స్థాయిలో రవాణా కాకుండా ఇబ్బంది ఏర్పడుతుంది. పిల్లలు, యుక్త వయసు వారిమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.

  • కాలుష్యం, పొగ తాగడం వల్ల ఆస్తమా ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది.
  • ఎండ వేడిమి ఉన్న రోజుల్లో వాయు నాళాలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. వాతావరణం చల్లబడినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఫలితంగా ముక్కుకు బదులు నోటితో గాలి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం.
  • గాలిలో తేమ శాతం తగ్గినప్పుడు కూడా ఉబ్బసం తలెత్తుతుందని గుర్తుంచుకోవాలి. ఇలా కాకుండా ఉండాలంటే.. ఎయిర్ కండీషర్​ను వాడుతూ ఉండాలి.
  • కరోనా ప్రభావం పడకుండా వ్యాక్సిన్లు తీసుకోవాలి. అవి కాకుండా ఫ్లూ వ్యాక్సిన్లు, నీమా కోకల్ వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు వేసుకోవాలి.
  • ఉదయం చలిగాలిలో వెళ్లేప్పుడు మాస్క్​, క్యాప్ వాడితే ఆస్తమా నుంచి రక్షించుకోవచ్చు. మంచి పోషక ఆహారం, వ్యాయామం చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా పల్మనరీ ఫంక్షన్​ టెస్టు చేయించుకోవాలి. దీనితో ఆస్తమా స్థాయిలను అంచనా వేయవచ్చు. తద్వారా తగిన మందులు వేసుకోవచ్చు.
  • వాతావరణం చలిగా మారినప్పుడు శరీరం వెచ్చగా ఉంచుకోవడం, స్వెటర్స్ వాడడం, చెవులు కప్పుకోవడం వల్ల ఆస్తమా నుంచి రక్షించుకోవచ్చు.
  • వంట చేసేప్పుడు వచ్చే పొగ, స్విమ్మింగ్​ ఫూల్​లో వచ్చే బలమైన క్లోరిన్ వాసనలు ఆస్తమాను పెంచుతాయని గుర్తుంచుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details