తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా? అయితే ఈ లాభాలు మిస్ అయినట్లే!

Ash Gourd Health Benefits : చాలా మందికి బూడిద గుమ్మడికాయ అంటే.. ఇంటికి దిష్టి తగలకుండా ఉండడానికి ఇంటి గుమ్మంలో కడతారని తెలుసు. కానీ అదే దిష్టికాయను ఆహారంగా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా..? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ash Gourd
Ash Gourd

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 1:40 PM IST

Health Benefits of Ash Gourd :ఇంటి గుమ్మంలో చాలా మంది బూడిద గుమ్మడి కాయను వేలాడదీస్తారు. అలా చేయడం వల్ల ఇంటికి, ఇంట్లోని వ్యక్తులకు ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుందనే ఉద్దేశంతో దానిని కడతారు. సిటీలలో తక్కువ కానీ, పల్లెటూర్లలో ప్రతి ఇంటి గుమ్మానికి ఇవి దర్శనమిస్తాయి. అయితే ఇంటి గుమ్మంలో కట్టే ఆ దిష్టికాయ.. దివ్య ఔషధంగా పని చేస్తుందనే విషయం ఎక్కువ మందికి తెలియదు. ఇకపోతే దీన్ని చాలా మంది తినడానికి ఇష్టపడరు కానీ.. బూడిద గుమ్మడి(Ash Gourd)ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకోవడం ఖాయం. నీటిశాతం ఎక్కువగా ఉండే దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో లభించే పండ్లతో పోలిస్తే.. అతి తక్కువ ఖర్చులో లభించే దీనితో ఎక్కువ విటమిన్లు పొందవచ్చని చెబుతున్నారు. అయితే ఇంతకీ బూడిద గుమ్మడికాయలో ఎలాంటి జౌషధ గుణాలున్నాయి? దీనిలో పోషకాలేంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

అనేక విటమిన్లు దీని సొంతం:ఈ బూడిద గుమ్మడికాయను.. చైనీస్‌ వాటర్‌ మిలన్‌, వింటర్‌ మిలన్‌, వ్యాక్స్‌ గార్డ్‌, సఫేద్‌ కద్దూ.. వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ కాయలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్-C, విటమిన్-B2, మెగ్నీషియం,జింక్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది ఫైబర్, నీటి శాతాన్ని కూడా అధికంగా కలిగి ఉంటుంది. ఇంకా మానవ శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలెన్నో ఈ కాయలో పుష్కలంగా ఉన్నాయి.

మీ జీవితకాలం మరో పదేళ్లు పెరగాలా? - అయితే ఈ ఆహార పదార్థాలు తినండి!

దిష్టి కాయ కాదు దివ్య ఔషధం : దీనిలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల.. బూడిద గుమ్మడిని తింటే రోగనిరోధక శక్తి పెరగటమే కాక కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే నిత్యం ఆహారంలో ఈ కాయను చేర్చుకోవడం వల్ల టైపు 2 డయాబెటిస్​ను నియంత్రణలో ఉంచుకోవచ్చంటున్నారు.

ఒక్క కాయ ప్రయోజనాలు అనేకం : బూడిద గుమ్మడిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అంటే 100 గ్రాముల గుమ్మడికాయను తీసుకుంటే కేవలం 13 క్యాలరీలు మాత్రమే వస్తాయి. అంతేకాక కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా ఈ కాయలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బూడిద గుమ్మడి ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. ఇక రోజు ఆహారంలో దీనిని భాగం చేసుకోవటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా అల్జీమర్స్ బారిన పడకుండా చేస్తుంది.

కిడ్నీలకు మేలు:బూడిద గుమ్మడి కిడ్నీలకు మేలు చేస్తుంది. 1995లో జియాంగ్సు జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ప్రచురించిన ఓ అధ్యయనంలో, కిడ్నీలు దెబ్బతిన్న ఎలుకలకు.. బూడిద గుమ్మడిలోని పదార్థాలను ఇచ్చారు. ఇవి కిడ్నీలను సంరక్షించడంలో సమర్థవంతంగా పనిచేసినట్లు కనుగొన్నారు. ఇరానియన్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ థెరాపాటిక్స్ 2005లో జరిపిన అధ్యయనం ప్రకారం.. బూడిద గుమ్మడి యాంటీ-డయేరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీనితో పాటు మూత్రవిసర్జన మంట, మూత్రం స్తబ్దత, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బూడిద గుమ్మడి తీసుకుంటే మంచిది.

డైట్​లో చేర్చి బోలెడు ప్రయోజనాలు పొందండిలా :బూడిద గుమ్మడి కాయని సలాడ్లు, సూప్‌లు, జ్యూస్‌లు, కూరలు, స్మూతీలు.. ఇలా అనేక రకాలుగా మీరు ఆహారంలోకి తీసుకోవచ్చు. అలాగే చాలా మంది దీనితో హల్వా, గుమ్మడి కూర, వడియాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పేట స్వీట్ వంటి వివిధ రకాల వంటలు వండుతారు. కేవలం గుమ్మడి కాయే కాకుండా దీని గింజలలో కూడా పుష్కలమైన ఔషధ గుణాలు ఉండటంతో చర్మ రక్షణ సంబంధిత క్రీములు, ఆయిల్స్​ తయారీలో ఉపయోగిస్తారు.

Tips to Beat Menopause Belly in Telugu : నలభైల్లో పొట్ట పెరుగుతోందా.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

ఈ '5' ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడిచేసి తింటున్నారా? - అయితే మీరు ప్రమాదానికి వెల్​కమ్​ చెప్పినట్లే!

చలికాలంలో డేట్స్​ తినడం వల్ల లాభాలు ఇవే!-తెలిస్తే వదిలిపెట్టరు సుమీ!

ABOUT THE AUTHOR

...view details