Artificial Sweetener Side Effects in Telugu : చాలా మంది షుగర్ పేషెంట్స్ చక్కెరకు బదులుగా కృత్రిమ తీపి పదార్థాలు (ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్) తీసుకుంటూ ఉంటారు. షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్తపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు కూడా ఆహారంలో చక్కెరను తీసుకోవడం మానేసి.. కృత్రిమ తీపి పదార్థాలతో తయారైన కూల్‌డ్రింకులు, షుగర్ ఫ్రీ ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో కేలరీలు లేకపోవటం వల్ల ఇవి తీసుకుంటే షుగర్, బరువు కంట్రోల్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ, కృత్రిమ తీపి పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Artificial Sweetener Health Side Effects :కృత్రిమ తీపి పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు..
గుండె సమస్యలు: ఆర్టిఫిషియల్ స్వీట్నర్ టైప్ 2 డయాబెటిస్, గుండె వ్యాధులకు కారకాలుగా పనిచేస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంకా ఈ రకమైన స్వీట్నర్ ఇన్సులిన్ నిరోధకతను పెంచి కడుపులో మంట కలిగేలా చేస్తాయి.
పరగడపున టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఇది తెలియకపోతే డేంజర్లో పడ్డట్లే!
పేగుల ఆరోగ్యంపై ప్రభావం..:ఆర్టిఫిషియల్ స్వీట్నర్ మన పేగుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు గ్లూకోజ్‌ని ఎక్కువగా తీసుకోకుండా నిరోధిస్తాయని చెబుతున్నారు. దీనివల్ల గ్లూకోజ్ ఇంటోలరెన్స్, ఊబకాయం లాంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల అజీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో అర్టిఫిషియల్ స్వీట్నర్ పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాలను పాడు చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, బరువు పెరిగిపోవడం జరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు.