తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కలసి బతుకుతున్నా.. ఒంటరిగా అనిపిస్తోందా? - how to communicate feeling lonely in a relationship

పెళ్లితో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించే అవకాశం ఉంటుంది. కానీ.. వారిమధ్య ప్రేమ, స్నేహం, గౌరవం లాంటివి కచ్చితంగా ఏర్పడతాయని(signs that you are alone in a relationship) చెప్పలేం. అందుకు కారణాలు అనేకం ఉంటాయి. పెళ్లితో మానసిక బంధం ఏర్పడకపోయినా, తమ వ్యక్తిగత జీవితంలోని శూన్యాన్ని తన భాగస్వామి పూర్తిగా తుడిచేయాలనే మితిమీరిన అంచనాలతో ఉన్నా ఆ బంధంలో అసంతృప్తులు ఉండవచ్చు. తాము ఊహించినట్లుగా జీవితం లేదనే భావన, ఒంటరిగా ఉన్నామనే బాధ కలగవచ్చు. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో(how to overcome loneliness in marriage) ఇప్పుడు తెలసుకుందామా..?

loneliness
ఒంటరితనం

By

Published : Dec 1, 2021, 7:00 AM IST

పెళ్లికి ముందు భార్యాభర్తలవి పూర్తిగా భిన్నమైన జీవితాలు. ఎవరి ఆలోచనలు, ఎవరి ఇష్టాఇష్టాలు వారికుంటాయి. అయితే వివాహానంతరం ఇద్దరికీ ఉమ్మడి లక్ష్యాలు ఉండాలి. తామిద్దరూ ఒకటే అన్నంతగా కలసి బతకాల్సి వస్తుంది. అనేక విషయాల్లో ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాల్సి ఉంటుంది. లేదంటే ఆ బంధంలో దగ్గరితనం, ఆత్మీయత లోపించి ఒంటరి భావన(feeling lonely in a marriage) కలుగుతుంది.

పెరుగుతున్న అంతరాలు..

కరోనా మహమ్మారి వచ్చాక.. కుటుంబసభ్యులు బయటకు వెళ్లడం, ఆనందంగా మిత్రులతో కలసి మెలసి ఉండటం వంటివి తగ్గిపోయాయి. దీనివల్ల ఎక్కువ సమయం కుటుంబంతో కలసి ఉండాల్సి వచ్చింది. ఫలితంగా గొడవలు, తగవులు ఎక్కువగా అవుతున్నాయని.. ఒకరికొకరు అర్థం చేసుకోవడం కంటే అపార్థాలు పెరిగిపోతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

చాలా ఇళ్లల్లో భార్యాభర్తలు ఒకరి డిమాండ్లను మరొకరు నెరవేర్చుకుంటూ ఉంటారు తప్ప.. కష్టసుఖాలు పంచుకోవడం ఉండట్లేదు. కాదు, లేదు అటువంటి వారు సహించలేరు. ఇలా ఎవరికి వారు నేనే కరెక్ట్ అనుకోవడం వల్ల మానసిక ఒంటరితనం పెరుగుతుంటుంది. వివాహ బంధంలో ఉన్నప్పటికీ.. నేను ఏకాకిని నన్ను అర్థం చేసుకోవట్లేదని భావిస్తుంటే.. అది మానసిక ఒంటరితనమే అవుతుంటుంది. అయితే వ్యక్తిత్వాలను బట్టి బంధాలు( how to overcome loneliness in marriage) నిలబడతాయని నిపుణులు చెబుతున్నారు.

"భార్యభర్తల బంధంలో తగాదాలు, విపరీత భావోద్వేగాలు, గొడవల వల్ల బేధాభిప్రాయాలు, మనస్పర్థలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో విడిపోతుంటారు కూడా. ఓ వ్యక్తి అవతలి వారికి ఎంత గౌరవం ఇస్తున్నారు? వారిని ఏ మేరకు అర్థం చేసుకున్నారు? అనే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి."

--డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, రిలేషన్​షిప్ కౌన్సిలర్

సంవత్సరాల తరబడి కలసి జీవిస్తున్నప్పటికీ.. ఎవరికి వారే అనేలా భార్యాభర్తలు ఉంటున్నారంటే వారి ఆలోచనలు, జీవన విధానం, లక్ష్యాలు ఇలా అన్నింటా తేడాలు ఉన్నాయని అర్థం. భార్యాభర్తల మధ్య మానసిక దూరం పెరిగిన కొద్దీ.. వారిలో ఒంటరితనం(feeling lonely in a marriage is depression?) భావన పెరిగిపోతుంది. ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఓసారి చూద్దాం..

  • భార్యాభర్తల మధ్య దూరం, మౌనం పెరగకుండా.. ఒకరితో ఒకరు చనువుగా ఉండటం చాలా ముఖ్యం.
  • పరస్పరం నిందించుకోకుండా ఒకరి ఆత్మీయత మరొకరికి తెలిసేలా మృదువుగా మాట్లాడుకోవాలి.
  • రోజులో కొంతసమయం కుటుంబంతో కలసి ఉండేలా తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి. ఇంటిపనులు, వాకింగ్ లాంటివి బంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉపకరిస్తాయి.
  • పని ఒత్తిళ్లు, బయటి కారణాల వల్ల భాగస్వామిపై చికాకు పడకుండా వారికి తమ పరిస్థితిని తెలియజెప్పడం ఉత్తమం.

భార్యాభర్తల మధ్య తలెత్తే ఇబ్బందులు రూపుమాపేందుకు పైన పేర్కొన్న చిట్కాలతో పాటు.. వాటి పరిష్కారం కోసం ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details