నట్స్‌ను నిత్యం తినటం వల్ల ఎన్నో రకాల లాభాలను పొందొచ్చు. శరీరానికి కావాల్సిన కీలక పోషకాలు వీటి ద్వారా అందుతాయి. రోజుకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. మరి నట్స్ తినడం వల్ల ఎలాంటి లాభాలు సమకూరుతాయో తెలుసుకుందాం.
బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, పల్లీలు, ఎండు ద్రాక్ష, అంజీర్, అక్రోట్, పిస్తాల్లాంటివి నట్స్ కిందకు వస్తాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు అద్భుతమైన న్యూట్రిషన్స్ కలిగి ఉంటాయి. వీటిని రోజుకు గుప్పెడు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్స్, మినరల్స్ కావాల్సినంత శరీరానికి అందుతాయి. ఒకే రకం నట్స్ కాకుండా అన్ని రకాలు కలిపి తీసుకుంటే మరీ మంచిది.
డ్రై ఫ్రూట్స్- గుండెకు ఎంతో మేలు
నట్స్ నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్, అకాల మరణం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.