మనసు పడిన అమ్మాయితో శృంగారంలో పాల్గొనాలని ఎందరో కలలు కంటారు. తీరా ఆ సమయం వచ్చేసరికి కంగారుతో, అమ్మాయిని మెప్పించగలనా లేదా అనే అనుమానంతో సెక్స్‌లో ఫెయిల్ అవుతుంటారు. దీంతో మరింత ఒత్తిడికి గురవుతారు పలువురు అబ్బాయిలు. ఇలా ఎందుకు జరుగుతుంది? మనసు పడిన అమ్మాయి దగ్గరు ఎందుకు విఫలమవుతారు? నిపుణులు ఏమంటున్నారంటే..
Anxiety Disorder: మనసు పడిన అమ్మాయి దగ్గర ఫెయిల్ అవడం అనేది సాధారణంగా యాంగ్జైటీ డిజార్డర్ (anxiety disorder) కారణంగా జరుగుతుంది. తనని ఇష్టపడుతున్న అమ్మాయిని సెక్స్‌లో మెప్పించగలనా? ఆమె అంచనాలను అందుకోగలనా అనే కొద్ది పాటి అనుమానం వచ్చినా.. ఫెయిల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సెక్స్ విషయంలో ఏమాత్రం అనుమానం, భయం, కంగారు ఉన్నా.. అంగం స్తంభించదు.