Anemia Hair Fall: సరైన నియమాలు పాటిస్తే రక్తహీనత గల వారు కూడా జుట్టు రాలిపోయే సమస్య నుంచి బయట పడోచ్చు అంటున్నారు డాక్టర్లు. ఆరోగ్యంగా ఉన్న వారిలోనూ జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది. అలాంటిది రక్తహీనత ఉన్న వారిలో మరింత ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలకుండా ఉండటంలో ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తం తయారవ్వడానికి సరిపడా ఐరన్ లేని తరుణంలో జుట్టు మరింత రాలిపోతుంది. మరి వీరి సమస్య తొలగిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
Anemia Hair Fall: ఇవి పాటిస్తే మీ జుట్టు రాలదు!
Anemia Hair Fall: జుట్టు ఊడిపోవడం అనేది ప్రతి మనిషిలో సర్వసాధారణంగా జరుగుతుంది. అలా కాకూడదని చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది రక్తహీనత కలిగిన వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఐరన్, విటమిన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో, బెల్లంలో అధికంగా ఉంటుంది. చికెన్, మటన్, లివర్‌లోనూ ఉంటుంది. అయాన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే 2 నుంచి 3 నెలల్లో జుట్టు పెరుగుతుంది. జుట్టు పొడవు అనేది వంశపారపర్యంగా వస్తుంది. ఒకవేల కుటుంబంలో ఇతరులకు ఉన్నా కూడా,, పెరగడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. కుటుంబంలో ఎవరికి పొడవు జుట్టు లేకపోతే అప్పుడు మీ జుట్టు పెరగడం కష్టంగా మారుతుంది. మంచి ఆహార నియమాలు పాటిస్తే జుట్టు సులభంగానే పెరుగుతుంది.
ఇదీ చదవండి:పగలు సెక్స్ చేయకూడదా? కవలలు పుట్టాలంటే ఎలా? మీ 16 డౌట్స్‌కు జవాబులు ఇవిగో..