దూరంగా నున్నగా.. కోమలంగా కనిపించేవారి ముఖంపై కొన్ని పెద్ద పుట్టుమచ్చలు ఉంటాయి. అవి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయని చాలామంది బాధపడుతుంటారు. ఇవి నొప్పి పుట్టించనప్పటికీ.. కళకళలాడాల్సిన ముఖం కళావిహీనంగా కనిపిస్తుందని వాటి గురించే ఆలోచిస్తుంటారు. మనలోని ఆత్మస్థైర్యాన్ని అంతో ఇంతో దెబ్బతీయగల వీటిని.. శాశ్వతంగా తొలగించుకోవడానికి ఏం చేయాలి?
తీసేయొచ్చు.. కానీ..
ముఖంపై పెద్ద పెద్ద పుట్టుమచ్చలు రావడం సహజం. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించొచ్చని వైద్యులు చెబుతున్నారు. సైజును బట్టి పెద్దవయినా, చిన్నవైనా తీసేయొచ్చంటున్నారు. వీటిని తొలగించినప్పటికీ ఇబ్బందేమీ ఉండదంటున్నారు. లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ, పంచ్ క్రాఫ్టింగ్ టెక్నాలజీ ద్వారా చేసే ఈ ప్రక్రియలో చర్మం సహజంగా ఉన్నట్లు కనపడేలా చేస్తామని వివరించారు.