తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Amla Oil For Hair Growth : మీ కురులు పొడవుగా, ఒత్తుగా పెరగాలా?.. ఈ సంప్రదాయ నూనె వాడండి!

Amla Oil For Hair Growth In Telugu : కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న నేటి కాలంలో జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు పెరగడం అనేవి చాలా మందిని వేధిస్తున్న సమస్యలు. అందుకే మీ కురులను సంరక్షించే, సంప్రదాయంగా తరతరాలుగా ఉపయోగిస్తున్న, ఓ అద్భుతమైన నూనె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

amla oil health benefits
Amla Oil For Hair Growth

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 4:29 PM IST

Updated : Aug 31, 2023, 4:50 PM IST

Amla Oil For Hair Growth :మనిషికి కురులు ఎంతో అందాన్ని ఇస్తాయి. ఆరోగ్యకరమైన కురులు మనల్ని ఎంతో ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. కురులు బలంగా, ఆరోగ్యంగా ఉంటాలంటే ఏం చేయాలని చాలా మంది ఆలోచిస్తారు. రకరకాల కెమికల్స్‌తో కూడిన షాంపూలు వాడుతారు. కానీ వీటి వల్ల మీ జుట్టు పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి అందమైన కురులను అందించే.. సహజ సిద్ధమైన పదార్థాలు, నూనెలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఆమ్లా ఆయిల్‌(ఉసిరి నూనె) ఒకటి. మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఈ ఉసిరి నూనెను ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ ఉసిరి నూనెతో కలిగే మరిన్ని ముఖ్యమైన ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. కురుల పెరుగుదల :
Hair Growth Amla Oil : ఆమ్లా ఆయిల్ చాలా పోషకాలు కలిగి ఉంటుంది. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుంది. ఈ విధంగా పొడవైన, ఒత్తైన కురులు పెరగడానికి ఉసిరిక నూనె దోహదపడుతుంది.

2. జుట్టు రాలడం నుంచి రక్షణ :
Hair Fall Control Oil : ఆమ్లా ఆయిల్​లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటితో పాటు ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు రాలిపోకుండా కాపాడతాయి. కురుల సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

3. కురులు పొడి బారకుండా సంరక్షణ :
How To Solve Dry Hair Problem : వెంట్రుకలు పొడిబారడం అనేది ఒక అనారోగ్య సూచన. పొడిబారిన కురులు.. పూర్తిగా ఆకర్షణను కోల్పోతాయి. కానీ ఈ సమస్యకు ఉసిరిక నూనెతో చెక్​ పెట్టవచ్చు. ఆమ్లా ఆయిల్​ వాడడం వల్ల కురులు మరలా హైడ్రేట్​గా మారుతాయి. ఫలితంగా కురులకు మరలా జీవకళ వస్తుంది.

4. కాంతులీనే కురులకు ఆమ్లా ఆయిల్ :
Amla Oil Benefits For Hair : ఆమ్లా ఆయిల్​లోని పోషకాలు కురులను ఆరోగ్యకవంతంగా మారుస్తాయి. అంతేకాకుండా వెంట్రుకల ఆకర్షణీయతను పెంచుతాయి.‌ ఒత్తుగా, మెరిసేలా మార్చుతాయి.

5. చుండ్రు దరిచేరదు :
Dandruff Control Oil : సాధారణంగా చుండ్రు కారణంగా, తలపై ఉన్న చర్మం పొడి రూపంలో రాలిపడుతూ ఉంటుంది. వెంట్రుకల కుదుళ్ళు కూడా బలహీనపడతాయి. కానీ ఆమ్లా ఆయిల్​ వాడితే.. అందులోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల చుండ్రు సమస్య పరిష్కారం అవుతుంది.

Last Updated : Aug 31, 2023, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details