బ్లాక్ ఫంగస్‌ను సాంక్రమిక వ్యాధి చట్టం- 1897 కింద గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. దేశంలో బ్లాక్ ఫంగస్ తీవ్రత గురించి చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఈ వ్యాధి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయన్న వార్తలు ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాధికి సంబంధించిన లక్షణాలు, జాగ్రత్తల గురించి తెలుసుకోవడం అత్యావశ్యకం.
ముప్పు ఎవరికి?
బ్లాక్ ఫంగస్‌ను మ్యూకోర్ మైకోసిస్ అని అంటారు. మధుమేహం ఉన్న వారు కోవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వాడితే బ్లాక్ ఫంగస్ సులభంగా సోకుతుంది. అందువల్ల.. చక్కెర నిల్వలు అధికంగా ఉన్న, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కరోనా రోగుల్లో దీని ముప్పు ఎక్కువ. కేన్సర్, అవయువ మార్పిడి ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారు, ఒరికొనజోల్ చికిత్స తీసుకున్న వారికీ ముప్పు ఎక్కువే.
ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పలు సందర్భాల్లో చూపు కోల్పోయిన వారూ ఉన్నారు.