తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మద్యం తాగితే మరింత వేగంగా కరోనా!

కొవిడ్​ విస్తరిస్తున్న నేపథ్యంలో మద్యం జోలికి వెళ్లవద్దంటున్నారు వైద్య నిపుణులు. మద్యం సేవించడం వల్ల రోగ నిరోధక శక్తి మందగించి సాంక్రమిక వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా వంటి క్రిములు తేలికగా లోపలికి ప్రవేశిస్తాయని చెబుతున్నారు.

Alcohol intoxicates the immune system!
మద్యం తాగితే మరింత వేగంగా కరోనా!

By

Published : Oct 11, 2020, 6:47 PM IST

కొవిడ్‌-19 వంటి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకూడదని కోరుకుంటున్నారా? అయితే మద్యం జోలికి వెళ్లకండి. దీంతో రోగ నిరోధక శక్తి మందగించి సాంక్రమిక, సాంక్రమికేతర జబ్బుల ముప్పు పెరుగుతుంది. మద్యం శరీరంలోని అన్ని అవయవాలు, కణాల మీద దుష్ప్రభావం చూపుతుంది.

మినహాయింపు ఏమీ కాదు

దీనికి రోగనిరోధక వ్యవస్థ కణాలూ మినహాయింపేమీ కాదు. ఉదాహరణకు- ఊపిరితిత్తుల్లోకి హానికారక క్రిములు ప్రవేశించకుండా అడ్డుకునే రోగనిరోధక కణాలు, సూక్ష్మకేశాలను మద్యం దెబ్బతీస్తుంది. ఇది కరోనా వైరస్‌ వంటి క్రిములు తేలికగా లోపలికి ప్రవేశించటానికి వీలు కల్పిస్తుంది. అంతేనా? మద్యంతో ఊపిరితిత్తుల కణజాలం, పేగుల్లోని సున్నితమైన పొర సైతం దెబ్బతింటుంది. ఇవన్నీ ఇన్‌ఫెక్షన్ల ముప్పును, తీవ్రతను పెంచేవే.

ఇదీ చూడండి:చెప్పుకోలేక.. ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారా?

ABOUT THE AUTHOR

...view details