కలుషిత వాతావరణంలో ఉండే వారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. వాయు కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారిలో జ్ఞాపక శక్తి తగ్గి మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది ఓ సర్వే. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.
స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన కొందరు పరిశోధకులు వాయు కాలుష్యం ఉన్న నగరాలపై పరిశీలన చేసి నివేదిక రూపొందించారు.
30 ఏళ్లలో మూడు రెట్లు
ఈ వాయు కాలుష్యం వల్ల జ్ఞాపకశక్తి తగ్గే వారి సంఖ్య రానున్న 30 ఏళ్లలో మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సమస్య నివారణకు ఇప్పటి వరకు చికిత్స లేనందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.