Acidity Home Remedies In Telugu :మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. కొందరు ఆరోగ్యానికి చేటు చేసే పదార్థాలను తీసుకుంటున్నారు. ఫలితంగా ఎసిడిటీ లాంటి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఎసిడిటీ ఒక సాధారణ జీర్ణ సమస్య. ఇది రావడం వల్ల కడుపు, ఛాతీలో అసౌకర్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది. అజీర్ణానికీ కారణమవుతుంది. మోతాదుకు మించి తినటం, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, కారం ఎక్కువ ఉన్నవి తినటం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం కూడా ఎసిడిటీకి రావడానికి దోహదం చేస్తాయి.
మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల అంటే తక్కువ తినటం, హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, సరైన సమాయానికి భోజనం చేయడం, ఒత్తిడికి గురికాకుండా ఉండడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశాలు ఉండవు. దీంతో పాటు మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఎసిడిటీ తగ్గించడానికి సహజ ఔషధాలు తయారు చేసుకోవచ్చు. అలాంటి 7 నేచురల్ రెమెడీస్ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. అల్లం
అల్లం మన వంటింట్లో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. అల్లం టీ, అల్లం జ్యూస్ లేదా భోజనంలో అల్లాన్ని భాగంగా చేసుకుంటే అది ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
2. కలబంద
కలబంద అందానికే కాదు, ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు కలబంద జ్యూస్ తాగడం వల్ల కడుపులో మంట నుంచి ఉపశమనం లభించి ఎసిడిటీ తగ్గుతుంది.
3. ఆపిల్ సైడర్
ఒక గ్లాసు నీటిలో 1-2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి భోజనానికి ముందు తాగడం వల్ల ఎసిడిటీ బాధ తప్పుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కడుపులో ఉన్న యాసిడ్స్‌ను తటస్థం చేసి ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
4. సోంపు
ఎసిడిటీని తగ్గించడంలో మీకు ఉపయోగపడే సహజ పదార్థాల్లో సోంపు గింజలు ఒకటి. భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలు తినవచ్చు. లేదా ఒక టీ స్పూను సోంపు గింజల్ని మరిగించి ఫెన్నెల్ టీ తయారు చేసుకుని తాగవచ్చు.