తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2022, 8:28 AM IST

ETV Bharat / sukhibhava

తాత్కాలిక పక్షవాతం గురించి తెలుసా? సకాలంలో వైద్యం చేయించకోకపోతే కష్టమే!

కొన్ని వ్యాధులు ఇలా వచ్చి అలా పోతాయి. ఆ లక్షణాలు గుర్తు పట్టేలోపే మనం సాధారణ స్థితికి వచ్చేస్తాం. అలాంటి జబ్బుల్లో ఒకటి తాత్కాలిక పక్షవాతం. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ మాయమవుతాయి. దీనికి సకాలంలో వైద్యం చేయించకపోతే ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

transient ischemic stroke
brain

కొన్ని వ్యాధులు ఇలా వచ్చి అలాపోతాయి. ఆ లక్షణాలు గుర్తు పట్టేలోపే సాధారణ స్థితికి వచ్చేస్తాం. అలాగని వదిలేశామంటే.. ఇక అవి మన అంతు చూసే దాకా వదలవు. అలాంటి జబ్బుల్లో ఒకటి తాత్కాలిక పక్షవాతం. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ మాయమవుతాయి. దీనికి సకాలంలో వైద్యం చేయించకపోతే తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధితో చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇది బ్రెయిన్‌ స్ట్రోక్‌ లాంటిదే...
తాత్కాలిక పక్షవాతం లక్షణాలు పూర్తి స్థాయిలో ఉండవు. కాళ్లు చేతులు లాగడం, బలం తగ్గిపోవడం, ఒక కంటి చూపు తగ్గిపోవడం, మాటలో తేడాలుంటాయి. తల తిరుగుతున్నట్టు ఉంటుంది. నడక సరిగా ఉండదు. ఈ లక్షణాలు గంటలోపే తగ్గిపోతాయి. అలా అని తేలిగ్గా తీసుకోవద్దు. భవిష్యత్‌లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా సీరియస్‌గా తీసుకోవాలి. పక్షవాతం లక్షణాలు కనిపించిన వారు మధుమేహం, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. వ్యాయామం తప్పక చేయాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే ప్రమాదం తగ్గుతుంది.

ABOUT THE AUTHOR

...view details