90-30-50 Diet Plan For Weight Loss : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, తగిన శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి.. ఇలా అనేక కారణాలతో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని జిమ్‌లలో తీవ్రమైన కసరత్తులు చేస్తుంటారు. అలాగే ఏవేవో వెయిట్ లాస్(Weight Loss) టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇక కొందరైతే బరువు పెరిగామని తెలియగానే తినే ఫుడ్‌ని తగ్గించేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా వెయిట్ లాస్ అవ్వడం అటుంచితే.. సరైన పోషకాలు అందక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాకాకుండా మేము చెప్పే 90-30-50 డైట్ ప్లాన్ ఫాలో అయ్యారంటే.. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా ఈజీగా బరువు తగ్గుతారు. ఇంతకీ ఈ డైట్ ప్లాన్ ఏంటి? దీని వల్ల ఎలా బరువు తగ్గొచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతున్న 90-30-50 డైట్ ప్లాన్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. నిర్దేశించిన మోతాదులో ప్రొటీన్, హెల్తీ ఫ్ట్యాట్, ఫైబర్ వంటి పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవడం ఈ డైట్ ప్రత్యేకత. చాలా మంది బరువు తగ్గడానికి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో బలహీనంగా మారి పోషకాహార లోపంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఈ డైట్ ప్లాన్ ద్వారా అలాంటి సమస్య ఏం ఉండదు.
ఇక 90-30-50 డైట్ ప్లాన్ ప్రకారం..ఒక వ్యక్తి రోజు తీసుకునే డైట్లో 90 శాతం కార్బోహైడ్రేట్స్, 30 శాతం ప్రొటీన్స్, 50 శాతం ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ డైట్‌ను ఫాలో అవుతూ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే గుడ్ రిజల్ట్స్ పొందవచ్చంటున్నారు.
90-30-50 డైట్ ప్లాన్ ద్వారా కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మాక్రోన్యూట్రియెంట్స్ సమతుల్యంగా తీసుకోవడం. ఎందుకంటే మన బాడీలో వివిధ విధుల నిర్వాహణలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ డైట్ ప్లాన్ ప్రకారం పోషకాలను తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తోంది. ఇక ఈ మాక్రోన్యూట్రియెంట్స్ బ్యాలెన్స్ ఆకలిని నియంత్రించడంలో, కోరికలను అరికట్టడంలో ప్రత్యామ్నాయ ఆహార విధానాలతో పోల్చినప్పుడు.. బరువును సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.