టిష్యూ పేపర్ మాదిరిగా కనిపిస్తూ.. కాస్త తడిగా, వైరస్‌ను అంతం చేయగల రసాయనంలో ముంచి తీసిన "వెట్ వైప్స్" కరోనా కాలంలో బాగా ఉపయోగపడుతున్నాయి. వీటిని సాధారణంగా పిల్లల డైపర్లు మార్చాక వారి చర్మాన్ని తుడవడానికి వాడుతారు. అంతే కాదు ఇంట్లో, కారులో ఉపరితలాలపై వైరస్‌ను అంతం చేసేందుకు వినియోగిస్తారు. ఇప్పుడు, మార్కెట్లో బోలెడన్ని యాంటీ-బాక్టీరియల్ వైప్స్ దొరుకుతున్నాయి. కానీ, వాటిని ఎలా వాడాలో తెలియక అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి.. ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..
- శరీరమంతా వాడుతున్నారా?
వెట్ వైప్స్‌ను శరీర సున్నిత భాగాలపై వాడితే.. దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని తడిగా ఉంచేందుకు వాడే రసాయనాలు అన్ని చర్మ రకాలకు సరిపోవు. అందుకే ముఖంపై, చిన్నారుల శరీరంపై వీటిని వాడనేకూడదు.
- బట్టలు తుడవద్దు..
వైప్‌తో ఉపరితలాలు శుభ్రం చేయొచ్చన్నారు కదా అని బట్టలు, సోఫాలపై ప్రయోగించకండి. ఎందుకంటే... వాటిలోని రసాయనాలు దారపు పోగులను నాశనం చేస్తాయి. అందుకే, కఠిన ఉపరితలాలకే వైప్స్ వాడాలి.
- ఒకటే మళ్లీ మళ్లీనా..?
టీవీ తుడిచాక దుమ్మేమి అంటలేదు కదా అని దాన్నే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ తలుపు తుడిచేస్తాం. కానీ, కంటికి కనిపించని బ్యాక్టీరియా మన కళ్లుగప్పి ఫ్రిడ్జ్‌పై చేరుతుందని గ్రహించం. కాబట్టి, ఒకటే వైప్ను మళ్లీ మళ్లీ వాడకపోవడమే మంచిది.
- పండ్లు తుడుస్తున్నారా?
పండ్లపై బ్యాక్టీరియా ఉంటుంది.. అలా అని బ్యాక్టీరియాను చంపే వైప్ పట్టుకుని పండ్లు తుడిచేస్తే.. ఆ రసాయనాన్ని మనం తినాల్సొస్తుంది. అందుకే, యాపిల్, జామ వంటి పండ్లు తెచ్చుకున్నప్పుడు శభ్రంగా నీటితో కడిగి తినేయండి. మరీ డౌట్‌గా ఉంటే, కాసిన్ని గోరు వెచ్చని నీటితో కడగండి. అంతే,గానీ, వైప్స్ వాడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి.
- బొమ్మలకు వైప్స్ వద్దు...