గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలామందికి కంటిసమస్యలు(Eye problems) ఎక్కువవుతున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ కల్చర్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు పెరగడం వల్ల చాలాసేపు కంప్యూటర్/ఫోన్ స్క్రీన్ చూస్తూ ఉండాల్సి వస్తుంది. దీంతో కళ్లు మసకబారడం, అక్షరాలు సరిగా కనిపించకపోవడం జరుగుతున్నాయి. కళ్లద్దాలు లేనిదే పేపర్ చదవలేకపోతున్నారు. ఫోన్ చూడలేకపోతున్నారు. మరి ఈ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా పడటం ఎలా? కంటిసమస్యను అదుపులో పెట్టేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
విటమిన్-సి ముఖ్యం
కంటిచూపును(Eye problems) మెరుగుపరుచుకునేందుకు విటమిన్-సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పుల్లని పళ్లతో పాటు క్యాప్సికమ్‌లో ఈ విటమిన్ ఉంటుంది. దీంతో పాటు ఒమేగా యాసిడ్స్ ఉన్న ఫుడ్కూడా తినాలి.
ఫ్యాటీ ఫిష్, సాల్మన్, ట్యూనా, ట్రౌట్, ఇతర సముద్ర చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆరెంజ్ కలర్లో ఉండే పండ్లు, స్వీట్ పొటాటో, క్యారెట్, మామిడి పండు, ఆప్రికాట్లలో అధిక మోతాదులో బీటా కెరోటిన్, విటమిన్ A ఉంటాయి. అలానే సీజనల్ ఫ్రూట్స్ ఎప్పటికప్పుడు తింటుండాలి.