Alternatives for Checking Phone When Waking Up : ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతుల్లో ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒక్క నిమిషం ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్లు ప్రవర్తించేవారు చాలామంది ఉంటారు. ఒక్క నిమిషం ఇంటర్నెట్ అగిపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోయే పరిస్థితులు ప్రస్తుత టెక్నాలజీ యుగంలో నెలకొన్నాయి. కొంతమంది ఫోన్, ఇంటర్నెట్ లేకుండా అస్సలు ఉండలేరు. పొద్దున లేచిన దగ్గర నుంచి అర్థరాత్రి వరకు ఫోన్‌తోనే గడుపుతున్నారు.
పొద్దున్నే లేవగానే ఫోన్..
What To Do Instead Of Checking Phone: అయితే పొద్దున్నే లేవగానే ఫోన్ చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ అది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. లేవగానే చూసే ఫోన్ నోటిఫికేషన్లు, చెడు వార్తలు రోజంతా మీరు చేసే పనిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫోన్ చూసే బదులు కొన్ని ప్రత్యామ్నాయ పనులు చేయడం ద్వారా రోజంతా ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండొచ్చు. ఫోన్ చూసే బదులు ఉదయం బైడ్‌పై నుంచి లేవగానే ఎలాంటి పనులు చేస్తే మంచిది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బుక్ చదవండి
Reading Books Benefits : పొద్దున్నే లేవగానే ఫోన్ చెక్ చేసుకునే బదులు పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి. దీని వల్ల జ్ఞానం పెరగుతుంది. దాంతో పాటు కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు ఆనందాన్ని అనుభూతి చెందుతారు. మీకు నచ్చిన ఏదైనా పుస్తకాన్ని పఠించడం ద్వారా రకరకాల విషయాలు తెలుస్తాయి. ఇవి మీరు చేసే ఉద్యోగానికి లేదా వ్యాపారానికి భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు.
ధ్యానం
Wake Up Meditation : ఉదయం బెడ్ పైనుంచి లేవగానే ధ్యానం చేయండి. ఇంట్లో మీకు నచ్చిన ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేయండి. దీని వల్ల మనుస్సులో ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు రోజంతా ఉల్లాసంగా గడపడానికి పొద్దున చేసే ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉదయం వ్యాయామం చేయడం ద్వారా కూడా ప్రయెజనముంటుంది. దీని వల్ల రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతారు.