6 Yoga Asanas To Reduce Office Stress : ప్రస్తుతం కాలంలో నిద్ర లేవడం.. త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కు పోవడం.. మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చి డైలీ పనులు చేసుకోవడం.. ఇదే అనేక మంది రొటీన్ లైఫ్. కొన్నిసార్లు ఆఫీస్ పనులు ఎక్కవగా ఉండడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో శారీరకంగానే కాకుండా మానసికంగాను ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఒత్తిడిని దూరం చేసి మళ్లీ ఎనర్జీని ఇచ్చేందుకు సాయపడే యోగాసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు
ఏంటో చూద్దాం.
1. సీటెడ్ క్యాట్ - కౌ స్ట్రెచ్
ముందుగా మీరు కూర్చున్న చోటనే రెండు చేతులో జోడించి.. ముందుకు స్ట్రెచ్ చేయండి. ఆ సమయంలో ఊపిరి పీల్చుకోండి. తర్వాత చేతుల్ని వెనక్కి తీసుకునేటప్పుడు శ్వాస వదలండి. ఈ సమయంలో వీపును కూడా ముందుకు వెనక్కి వంచాలని గుర్తుంచుకోండి. ఈ ఆసనం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. మన భంగిమను సైతం మెరుగుపరుస్తుంది.
2. ఛైర్ పీజియన్ పోస్
దీన్నే కుర్చీ కపోతనసన ఆసనం అని కూడా అంటారు. మీరు కూర్చున్న చోటు నుంచే ఇది ట్రై చేయవచ్చు. కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు ఒక కాలి మీద మరో కాలు వేసుకోవాలి. ఒక కాలి మడమ మరో కాలి మోకాలు వచ్చేలా ఉండాలి. తర్వాత మోకాలిపై సున్నితంగా నొక్కుతూ ఉండండి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే అసౌకర్యం నుంచి మనకు విముక్తి కల్పించడంలో ఇది సహాయపడుతుంది.
3. సీటెడ్ ఫార్వార్డ్ ఫోల్డ్
కుర్చీపై కూర్చుని మీ రెండు కాళ్లను ముందుకు చాపండి. తర్వాత రెండు చేతులతో పాదాల్ని అందుకోండి. ఆ సమయంలో మీ తల మోకాళ్లను తాకేలా ఉండాలి. ఈ స్ట్రెచ్తో వెన్నుపూస కింద భాగం, తొడ కండరాల్లో ఉన్న నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.