కొన్ని కొన్ని అలవాట్లు మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. వారు అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు ఉపకరిస్తాయి. కానీ కొన్ని అలవాట్లు.. అదే మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి. కొవిడ్ వేళ ఇవి బాగా ఎక్కువ అయ్యాయి. చిన్నవే కదా అనుకుని మనం నిర్లక్ష్యం చేసే ఎన్నో అలవాట్లు.. ఆరోగ్య, రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. వాటిల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్ర:- శరీరానికి సరైన నిద్ర ఎంతో అవసరం. కానీ చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు. దీని ప్రభావం ఆ తర్వాతి రోజు మీద పడుతుంది. రోజంతా చిరాకుగా ఉంటుంది. రోజుకు కనీసం 6 గంటల నిద్ర అవసరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర విషయంలో రాజీపడితే రోగనిరోధక శక్తి, శ్వాస, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటాయి.
జంతు మాంసం-ప్రోటీన్:- జున్ను, మాంసం వంటి జంతువుల నుంచి వచ్చిన ప్రోటీన్లు కేన్సర్‌కు దారితీస్తాయి. వాటిల్లో ఉండే ఐజీఎఫ్1 హార్మోన్లే ఇందుకు కారణం. ఇది ధూమపానం వల్ల కలిగే అనర్థాలతో సమానం. అందువల్ల వీటిని దూరం పెట్టి.. చెట్ల నుంచి వచ్చే ప్రోటీన్లు అయిన బీన్స్ వంటి పదార్థాలను ఆహారంలో తీసుకోవాలి.