తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

జలుబూ, దగ్గు బారినపడకుండా చేదుగా ఇలా చేయండి - Bitter gourd for health

వర్షాకాలంలో జలుబూ, దగ్గు బారినపడటం సహజమే. వాటి బారిన పడకుండా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. కాకరకాయతోనూ కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

kakarakaya
kakarakaya

By

Published : Jul 3, 2020, 12:00 PM IST

  • కాకరలో పీచు ఎక్కువగా ఉంటుంది. దాంతో జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడమే కాకుండా అధిక బరువునూ నియంత్రిస్తుంది.
  • విటమిన్‌-సి, ఎ, ఫొలెట్‌, పొటాషియం, జింక్‌, ఇనుము నిండుగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లోని విటమిన్‌-సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనత దరిచేరదు.
  • విటమిన్‌-ఎ పుష్కలంగా ఉండే కాకర తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. కంటిచూపు చురుగ్గా ఉంటుంది. దీంట్లోని ఫొలెట్‌ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
  • ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే ఇన్సులిన్‌ని తగుమోతాదులో అందిస్తుంది.
  • ఉదర, పేగు, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లతో పోరాడే లక్షణాలు దీనికి ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details