Best Yoga Pose for Better Digestion : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. అయితే.. మంచి ఫుడ్ తీసుకుంటేనే సరిపోదు.. మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయినప్పుడే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మన బాడీలోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలంటే.. జీర్ణవ్యవస్థ(Digestion System) పర్ఫెక్ట్గా ఉండాలి. లేదంటే.. ఎన్నో సమస్యలు వస్తాయి.
Yoga for Good Digestion : కానీ.. చాలా మందిలో జీర్ణక్రియ గాడితప్పుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక జీర్ణాశయ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, కడుపులో ఉబ్బరం, మలబద్ధకం వంటి అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తింటున్న తిండి సరిగ్గా జీర్ణం కాకపోవడమే. అయితే.. అలాంటి వారికోసం ఆరోగ్య నిపుణులు సూచించిన బెస్ట్ యోగముద్రను తీసుకొచ్చాం. తిన్న తర్వాత దీనిని డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా త్వరగా ఆహారం జీర్ణం కావడమే కాకుండా మీ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరగుపరుచుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ అదెంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీరు ఆరోగ్యంగా ఉండడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్యనిపుణులు సూచిస్తున్న యోగాసనం.. వజ్రాసనంలో కూర్చుని పూషన్ ముద్ర వేయడం. వజ్రాసనాన్నే థండర్ బోల్ట్ ఫోజ్ లేదా డైమండ్ ఫోజ్ అని కూడా అంటారు. యోగాసనాలలో తిన్న వెంటనే చేయగలిగే ఏకైక భంగిమ.. వజ్రాసనం అని చెప్పుకోవచ్చు. దీనిని భోజనం తర్వాత వేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు పూషన్ ముద్ర వేయండి. దీని ద్వారా మరిన్ని హెల్తీ బెనిఫిట్స్ లభిస్తాయి.