తెలంగాణ

telangana

ETV Bharat / sukhibawa

3డీ మాస్కులను ఇంట్లోనే తయారు చేస్తారా? - ఏపీ కరోనా వార్తలు

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మాస్కులు ధరించటం తప్పనిసరి అవుతోంది. సాధారణ మాస్కులు కేవలం మూతి, ముక్కు వరకే రక్షణ కల్పిస్తాయి. అయితే నుదురు నుంచి మెడ వరకు పూర్తి రక్షణ కల్పించే 3డీ మాస్కులు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని ఇంట్లోనే ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం.

how to make 3d masks in home
3డీ మాస్కులను ఇంట్లోనే తయారు చేసుకోండిలా...

By

Published : Apr 29, 2020, 7:58 PM IST

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీనివల్ల మాస్క్ లేకుండా రోడ్డుపైకి రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణ మాస్కులతో పాటు ప్రజలకు మరింత రక్షణ కలిగించే పలు రకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. నుదురు నుంచి మెడ వరకు, చెవులకు పూర్తి రక్షణ కల్పిస్తూ 3డీ మాస్కులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని వినియోగిస్తే వైరస్ నుంచి రక్షణ పోందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుపుతున్నారు వైద్యులు. అంతేకాకుండా ముఖానికి చేతులు తగలకుండా ఉంచేందుకు ఈ మాస్కులు ఉపయోగపడతాయని డాక్టర్ పీ.వీ రామారావు తెలిపారు. వాటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఆయన వివరించారు.

3డీ మాస్కులను ఇంట్లోనే తయారు చేసుకోండిలా...

ABOUT THE AUTHOR

...view details