దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
11:26 April 23
దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్లో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌లు సంయుక్తంగా ల్యాబ్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఇక నుంచి మొబైల్ వైరాలజీ ల్యాబ్ సేవలు వినియోగంలో రానున్నాయి. ఆన్లైన్ ద్వారా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ సంయుక్తంగా ల్యాబ్‌ని ప్రారంభించారు. బీఎస్ఎల్ 3 టెక్నాలజీతో ఈ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఐకామ్, ఐ క్లీన్ సంస్థల సహకారంతో డీఆర్డీఓ 15 రోజుల వ్యవధిలో ఈ ల్యాబ్‌ను రూపొందించింది.
ల్యాబ్ సహాయంతో రోజుకు 3 షిఫ్టుల్లో కలిపి 1000 మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. ఇతర వైరస్‌లపై ప్రయోగాలకు చేసేందుకు సైతం ఈ ల్యాబ్‌ని వినియోగించనున్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ తరహా ల్యాబ్‌లు భాగ్యనగరంలోనూ ప్రారంభం కావటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇవీచూడండి:తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్