చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పక వేయించాలని యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, వైద్య అధికారి సాంబశివ రావు అన్నారు. భువనగిరి పట్టణం ఇందిరా నగర్లో పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అధికారికంగా ఇక్కడ ఏర్పాటు చేశామని వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. జిల్లాలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లాలో 6,09,842 మంది ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. పోలియో నిర్వహణకు మొత్తం 500 బూతులు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నట్లు తెలిపారు. 50 ట్యూటన్సర్ల ద్వారా అందిస్తున్నట్టు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది ఉన్నారని.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ అనితా రామచంద్రన్, మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు, వైస్ ఛైర్మన్ చింతల కిష్టయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'చిన్నారుల ఆరోగ్యానికి పోలియో చుక్కలు తప్పనిసరి'