యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తామని ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గం ఇంఛార్జి బీర్ల ఐలయ్య తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని పార్టీ కార్యాలయంలో బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటరీ పార్టీ యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి స్వాతి ముఖ్య అతిథిగా హాజరై... కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
'ఇక నుంచి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం'
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని పార్టీ కార్యాలయంలో బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటరీ పార్టీ యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి స్వాతి ముఖ్య అతిథిగా హాజరై... కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
youth congress leaders review meeting in yadagirigutta
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం వల్లే గత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని స్వాతి అభిప్రాయపడ్డారు. ఇక ముందు అలాంటి తప్పిదాలు జరగకుండా యూత్ కాంగ్రెస్ నేతలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని నాయకులు తెలిపారు.