రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కి చెందిన గట్టు శ్రవణ్ సరికొత్త మాస్కును తయారు చేశారు. కరోనాపై పోరాటం చేస్తున్న వారికి ఒక్కరూపాయికే అందించినట్లు శ్రవణ్ వెల్లడించారు. ఈ మాస్కు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తుందని శ్రవణ్ పేర్కొన్నారు. వైరస్‌ను లెక్క చేయకుండా ప్రజాసేవ చేస్తున్న పోలీసులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, పాత్రికేయులకు తనవంతు సాయంగా సేఫ్టీ మాస్క్, గ్లౌజ్, శానిటైజర్ బాటిల్లను అందజేశారు.
సరికొత్త మాస్క్ తయారు చేసిన చౌటుప్పల్ యువకుడు - new corona mask
మాస్కుల కొరత ఉందనే విషయాన్ని గ్రహించి... తల, ముక్కు, నోరు, కళ్లకు రక్షణ ఉండే విధంగా మాస్కును తయారు చేశాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన శ్రవణ్.

మాస్క్ తయారు చేసిన చౌటుప్పల్ యువకుడు
మాస్కుల కొరత ఉందనే విషయాన్ని గ్రహించిన శ్రవణ్... తల, ముక్కు, నోరు, కళ్లకు రక్షణ ఉండే విధంగా మాస్కును తయారు చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య, ప్రాథమిక ఆసుపత్రి వైద్య సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగించండి.. ప్రధానితో కేసీఆర్