యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రాయగిరి నుంచి మోత్కూర్ వెళ్లే రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని యువజన కాంగ్రెస్ నేతలు ఆత్మకూరు మెయిన్ రోడ్డు వద్ద నిరసన తెలియజేశారు. కాటేపల్లి నుంచి మోత్కూరు వరకు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
'రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి' - yadadri bhuvanagiri latest news
రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు రోడ్డు వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. వర్షంపడితే రోడ్లు కాస్త చెరువులను తలపిస్తున్నాయంటూ వాపోయారు.
'రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి'
ఆత్మకూరు మెయిన్ రోడ్డు దుబ్బబావి వద్ద చిన్నపాటి వర్షం పడితే.. రోడ్డు చెరువును తలపిస్తుందని వాపోయారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు పనులను ప్రారంభించి.. ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:షాపింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం