రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోయిన బాధితుల సంఘం సమావేశం నిర్వహించింది.
'సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి' - lock down updates
యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, భూములు కోల్పోయిన భాధితుల సంఘం సమావేశమైంది. పది రోజుల్లో తమకు కచ్చితమైన హామీ ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు.
'సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి'
2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఐలయ్య కోరారు. 10 రోజుల్లో జిల్లా కలెక్టర్‌తో గానీ... ఎమ్మెల్యేతో గానీ సమావేశం నిర్వహించి కచ్చితమైన హామీ ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.