తెలంగాణ

telangana

ETV Bharat / state

CI Narsaiah suspended: సీపీ మహేశ్ భగవత్ కీలక నిర్ణయం.. సీఐ నర్సయ్య సస్పెన్షన్ - సీఐ నర్సయ్య సస్పెన్షన్‌ వేటు

Yadagirigutta Rural CI Narsaiah suspended
Yadagirigutta Rural CI Narsaiah suspended

By

Published : Oct 28, 2021, 5:24 PM IST

Updated : Oct 28, 2021, 6:13 PM IST

17:23 October 28

CI Narsaiah suspended

రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్కిల్ ఇన్​స్పెక్టర్ నర్సయ్యను సస్పెండ్(Yadagirigutta Rural CI Narsaiah suspended) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

యాదాద్రి భువనగిరి జిల్లా యాదారిగిగుట్ట రూరల్ సీఐ నర్సయ్య(Yadagirigutta Rural CI Narsaiah)పై ఓ  ఫిర్యాదు అందింది. భూ వివాదంలో జోక్యం చేసుకున్నారనేది ఆ ఫిర్యాదు సారాంశం. తమ ప్రత్యర్థులతో కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు కంప్లైట్ ఇచ్చారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఐ నర్సయ్యపై సస్పెన్షన్ వేటు(Yadagirigutta Rural CI Narsaiah suspended) విధించారు.  

  • గతంలోనూ కొందరిపై వేటు...

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ట్రాఫిక్ సీఐ కృష్ణపై ఉన్నతాధికారులు గతంలో వేటు వేశారు. మద్యం మత్తులో కారుతో ఓ వ్యక్తిని ఢీకొట్టినందుకుగానూ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సీఐని సస్పెండ్ చేస్తూ వెస్ట్​జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ట్రాఫిక్ పోలీస్​స్టేషన్​లో సీఐగా విధులు నిర్వహిస్తోన్న కృష్ణ... రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ పరిధిలో మద్యం మత్తులో ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ప్రమాదానికి గురైన వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సీఐ కృష్ణపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. విధుల్లోంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

  • రిసార్టులో మహిళతో...

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అనిల్​ సస్పెన్షన్​కు గురయ్యారు. కీసరలోని సైలెంట్​ రిసార్ట్​లో ఓ మహిళతో సన్నిహితంగా ఉండగా... పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు అదుపులోకి తీసుకున్నారు.  

విచారణ చేసిన అధికారులు ఎస్సై అనిల్​పై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ అనిల్​ను సస్పెండ్​ చేశారు.

సమాజాన్నే చక్కదిద్దాల్సిన కొందరు పోలీసులు ఇలా వ్యవహరించి నిబద్ధత కలిసిన ఆ శాఖకే మచ్చతెస్తున్నారు. తప్పు చేస్తే సరిదిద్దాల్సిన చేతులతోనే తప్పుడు వ్యవహారాల్లో మునిగితేలుతున్నారు. 

ఇదీ చూడండి:Tragedy : ఒకే వీధిలో ముగ్గురు యువతులు అదృశ్యం.. చెరువులో మృతదేహాలు

Last Updated : Oct 28, 2021, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details