యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట ప్రధాన రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బాధితుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేయడంతో అధికారులు యంత్ర సామర్థ్యం పెంచి పనులు చకచకా సాగిస్తున్నారు. ఇప్పటి వరకు మల్లయ్య ధర్మశాల వరకు గల భవనాలను కూల్చివేశారు. రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ... దారికి అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు బారికేడ్లను దాటి ప్రయాణాలు సాగిస్తున్నారు.
Yadadri temple: శరవేగంగా సాగుతున్న రహదారి విస్తరణ పనులు - Reconstruction work of Yadadri temple Latest news
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రోడ్డు కోసం సేకరించిన స్థలాల్లో ఉన్న భవనాలను కూల్చివేస్తున్నారు.

శరవేగంగా సాగుతున్న రహదారి విస్తరణ పనులు
బాధితులు, చూడటానికి వచ్చిన స్థానికులు, ఇనుప చువ్వలు సేకరించుకొనే పేదలు, రాళ్లను తరలించడానికి వచ్చిన జనంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. లాక్డౌన్ సమయంలోనూ ప్రజలు భారీగా వస్తున్నారు. పాతగుట్ట చౌరస్తా వరకు రహదారి విస్తరించాల్సి ఉండడంతో దుకాణదారులు ముందస్తుగా తమ దుకాణాలు, నివాసాలు ఖాళీ చేస్తూ, సామగ్రిని తరలిస్తూ హడావుడిగా కనిపించారు.
ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా