యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేక పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక బీఎల్వీఓ సిబ్బంది, వీల్ ఛైర్లు లేక వికలాంగులు చాలా ఇబ్బందులు పడ్డారు.
విద్యుత్ సరఫరా లేక పోలింగ్ అరగంట ఆలస్యం - విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేక, మరికొన్ని చోట్ల వీల్చైర్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ లేకపోవడం వల్ల పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
![విద్యుత్ సరఫరా లేక పోలింగ్ అరగంట ఆలస్యం no power](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5796044-15-5796044-1579669982206.jpg)
విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న 12 వార్డుల్లో 48 మంది పోటీలో ఉన్నారు. 12 వార్డులకు గాను 24 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం 15 వేల 637 మంది ఓటర్లు ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్
ఇవీ చూడండి: హలో ఓటర్.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!