యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ మొదటి బడ్జెట్ సమావేశం కోరం లేక వాయిదా పడింది. కౌన్సిల్లో 12 మంది ఉండగా బుధవారం అధికార పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రజిత ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత హాజరయ్యారు.
కోరం లేక మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాయిదా - యాదగిరిగుట్ట బడ్జెట్ సమావేశం వాయిదా
యాదగిరిగుట్ట మున్సిపల్ మొదటి బడ్జెట్ సమావేశం కోరం లేక వాయిదా పడింది. తెరాసకు చెందిన ఐదుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తదుపరి సమావేశం ఈ నెల 20న నిర్వహించనున్నట్టు కమిషనర్ ప్రకటించారు.
కోరం లేక మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాయిదా
ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఏడుగురు ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరుతో సమావేశం జరగలేదు. బడ్జెట్‌కు సంబంధించిన వివరాలు, పత్రాలు ముందస్తుగా ఇవ్వనందున సమావేశానికి హాజరు కాలేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు తెలిపారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు