తెలంగాణ

telangana

ETV Bharat / state

వెలిగొండ చెరువు వద్ద ప్రత్యేక పూజలు.. 11 ఏళ్ల తర్వాత..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వెలిగొండ చెరువు వద్ద ఎంపీపీ చీర శ్రీశైలం ప్రత్యేక పూజలు చేశారు. 11 ఏళ్ల తర్వాత చెరువు మత్తడి పోయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

prayers to veligonda pond
వెలిగొండ చెరువు వద్ద ప్రత్యేక పూజలు.. 11 ఏళ్ల తర్వాత..

By

Published : Sep 25, 2020, 9:55 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో వెలిగొండ చెరువు మత్తడి దూకింది. ఎంపీపీ చీర శ్రీశైలం ఆధ్వర్యంలో చెరువు వద్ద గంగాదేవికి పూజలు చేశారు. 11 ఏళ్ల తర్వాత మత్తడి పోయడంపై రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు.

సుదూరంలో ఉన్న గోదావరి జలాలను రప్పించడం కన్నా.. అందుబాటులో ఉన్న జలాలను సంరక్షించాలని ఎంపీపీ చీర శ్రీశైలం హితవు పలికారు. మండలంలోనే పెద్ద చెరువుగా వెలిగొండ చెరువుకు పేరుందని అన్నారు. గొలుసుకట్టు కాల్వకు తామే సొంత ఖర్చులతో పూడిక తీయడం వల్లనే చెరువులోకి నీరు చేరిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు.

ఇవీచూడండి:'శ్రీశైలం నీటివిడుదల రెండు రాష్ట్రాలకూ ప్రయోజనకరమే'

ABOUT THE AUTHOR

...view details