కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవాలని యాదగిరిగుట్ట ఏసీపీ నర్సింహరెడ్డి సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక ఊరు- ఒకే గణపతి అనే నినాదంతో ముందుకు సాగాలని తెలిపారు. విఘ్నేశ్వరుడి విగ్రహం ఎత్తు 3 ఫీట్లకు మించరాదని పర్యావరణ హితం కోరుతూ... మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు.
'ఒక ఊరు- ఒకే గణపతి నినాదంతో ముందుకు సాగాలి' - corona effect
యాదగిరిగుట్టలో రానున్న వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవాలని ఏసీపీ నర్సింహారెడ్డి సూచించారు. విఘ్నేశ్వరుడి విగ్రహం ఎత్తు 3 ఫీట్లకు మించరాదని పర్యావరణ హితం కోరుతూ... మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు.
yadagirigutta acp narsimhareddy on vinayakachavithi festival
ప్రజారక్షణే పోలీసుల ధ్యేయమని... ఉత్సవ కమిటీలు యువజన సంఘాలు సహకరించాలని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి నిబంధనలు రూపొందిస్తామని ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు.