ఉద్యోగులకు పే రివిజన్ కమిషన్ (PRC) రిపోర్టు అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగా.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, ఆత్మకూరు (మం) గుండాల, అడ్డగూడూరు మండలాల ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - cm kcr on prc
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో పీఆర్సీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్కు పాలాభిషేకం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పే రివిజన్ కమిషన్ (PRC) రిపోర్టు అమలు చేస్తామని 30 శాతం ఫిట్‌మెంట్, ఉద్యోగులకు వయోపరిమితి 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచనున్నట్లు తెలిపారన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 9 లక్షల ఉద్యోగులకు లాభం చేకూరనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.
ఇదీ చదవండి:కూడవెళ్లి వాగుకు గోదావరి నీటి విడుదల