యాదాద్రి శ్రీలక్షీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధి పనులు గడువులోగా పూర్తయ్యేలా అధికారులు పనుల్లో వేగం పెంచారు. నూతన ఆలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన పసుపురంగు విద్యుద్దీపాలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆలయ తిరు మాడ వీధులు, రాజగోపురాల మధ్యభాగాలు, అద్దాల మండపం, అష్టమండపం ఆవరణలో ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. క్షేత్రంలో ప్రముఖుల వసతి కోసం నిర్మిస్తున్న సూట్ల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఖరీదైన ఫర్నీచర్, సకల హంగులతో వీటిని రూ.104 కోట్లతో నిర్మిస్తున్నారు.
యాదాద్రి క్షేత్రంలో తుది దశకు చేరిన వీఐపీ వసతి సూట్ల నిర్మాణం - తెలంగాణ వార్తలు
యాదాద్రి ఆలయం పునర్నిర్మాణ పనుల్లో యాడా వేగం పెంచింది. క్షేత్రంలో వీఐపీల వసతి కోసం చేపట్టిన సూట్ల నిర్మాణం దాదాపు పూర్తైందని వెల్లడించింది. సకల హంగులతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది.
తుది దశకు చేరిన నిర్మాణం
క్షేత్రంలో ఒక ప్రధాన సూటుతో పాటు 14 విల్లాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ వసతి సముదాయాలకు ప్రత్యేక శోభ తీసుకువచ్చేలా వివిధ రకాల చిత్రాలు, వస్తువులను అమర్చుతున్నారు. ప్రధానాలయానికి మరిన్ని ఇత్తడి దర్శన వరుసలు వచ్చాయి. సీఎం సూచన మేరకు....దర్శన వరుసల వెడల్పు పెంచి ఏర్పాటుచేస్తున్నారు.
ఇదీ చదవండి:వచ్చెను ఉగాది.. తెచ్చెను వసంతం!!